తెలంగాణలో 12వ శతాబ్దం నాటి భారీ గణపతి.. ఎక్కడో తెలుసా?

TG: తెలంగాణలోని <a href="https://www.google.com/maps/place/AVANCHA+GANAPATHI/@16.7130592,78.2532297,3a,75y,90t/data=!3m8!1e2!3m6!1sCIABIhCDbtzdjOdP32wTG0pMKGfZ!2e10!3e12!6shttps:%2F%2Flh3.googleusercontent.com%2Fgrass-cs%2FACvplmPNqhrg2feb22oCk2jzYKnd_lr83S4cTsC7cJBgC0ahD9NoY1cHxUie_dMwuWCTWcGtIgT8Kda7p1EqM-pEHDe56NUEZ0a0cerL0sn8FxEe4u9lcQreWCYa0D5BMGjksULqlydm_w0QYghw%3Dk-no!7i1872!8i4160!4m6!3m5!1s0x3bca390059b5ed3f:0x6310f8212e7c863a!8m2!3d16.7130592!4d78.2532297!16s%2Fg%2F11z5nybyhj?authuser=0&entry=ttu&g_ep=EgoyMDI2MDkwOS4wIKXMDSoASAFQAw%3D%3D">నాగర్‌కర్నూల్ జిల్లా అవంచలో</a> ఉన్న భారీ ఏకశిలా గణపతి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దాదాపు 12వ శతాబ్దానికి చెందిన ఈ గణపతి విగ్రహాన్ని వెస్ట్రన్ చాళుక్యుల కాలంలో గ్రానైట్ బండపై చెక్కినట్లు చరిత్ర చెబుతోంది. విగ్రహం 7.62 మీటర్లు (25 అడుగులు) ఎత్తు ఉండగా.. పీఠంతో కలిపి 9.14 మీటర్లు (30 అడుగులు) ఉంటుంది. అప్పట్లో అవంచను రాజధానిగా చేసుకున్న చాళుక్య రాజు తైలపుడు ఈ విగ్రహాన్ని చెక్కించినట్లు తెలుస్తోంది. మీ ఊరి మట్టి గణపతితో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.



