🔊 DJ గోల ఎక్కువైతే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వొచ్చా ?

విశాఖలో ఒక పౌరుడు చేసిన లీగల్ ఫైట్ ఇప్పుడు నోయిస్ పొల్యూషన్‌తో ఇబ్బంది పడే అందరికి దారి చూపిస్తోంది. ఆగస్టు 28న అక్కయ్యపాలెం నేషనల్ హైవేపై భారీ DJ సౌండ్స్, పాటలతో ప్రజలకు అసౌకర్యం ఏర్పడింది. దీని వల్ల జనాలు ఇబ్బంది పడటంతో ఒక వ్యక్తి 4వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR ఫైల్ చేసి DJ సౌండ్ సిస్టమ్స్ సీజ్ చేశారు. వినాయక చవితి టైమ్‌లో లిమిట్ దాటి DJ సౌండ్స్ పెట్టినా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని గుర్తించాలి.


