గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి

TG: జగిత్యాల జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ ఐదు మున్సిపాలిటీల్లో చేపడుతున్న ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్లను, గ్రామీణ ప్రాంతాల ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ అధికారిని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అడిగి తెలుసుకున్నారు. గణేష్ ఉత్సవాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.




