రోడ్డు ప్రమాద మరణాలు బాధాకరం: బీజేపీ

రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతోమంది మరణించడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మెట్టుగూడలో బీజేపీ ఓబీసీ మోర్చా నిర్వహించిన రహదారి భద్రతా చైతన్య కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి కుటుంబ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేకల సారంగపాణి, వై. సురేష్ కుమార్, వెంకటరమణి తదితరులు పాల్గొన్నారు.


