← Back to news

తోడా గిరిజనుల గురించి మీకు తెలుసా?

By Vishi· 10h ago
తోడా గిరిజనుల గురించి మీకు తెలుసా?

తమిళనాడు నీలగిరి కొండల్లో నివసించే తోడా గిరిజనుల గురించి మీకు తెలుసా? వీళ్ల జనాభా 1,500 నుంచి 2,000 మంది మాత్రమే. కొన్ని స్టడీల ప్రకారం 3,500 సంవత్సరాల క్రితం నుంచి వీళ్లు ఈ కొండల్లో నివసిస్తున్నారు. వారి భూములు ఇప్పుడు యునెస్కో గుర్తింపు పొందిన నీలగిరి బయోస్పియర్ రిజర్వ్‌లో భాగమయ్యాయి. తోడాలు ప్రధానంగా గేదెలను పెంచుతారు. గేదెలు వారికి చాలా పవిత్రం. పాలు, వెన్న వంటి వాటితోనే వారి జీవనం నడుస్తుంది. వీరు చిన్న గ్రామాల్లో నివసిస్తారు. వాటిని ముండ్ అంటారు.

More in Infotainment