ఫ్లోరైడ్ గ్రామానికి బోరు.. దళిత, గిరిజనుల పోరాట విజయం!
రోలుగుంట మండలం అంట్లపాలెంలో దళిత, గిరిజన కుటుంబాలు 38 ఉన్నాయి. ఈ గ్రామాన్ని ఫ్లోరైడ్ గ్రామంగా ప్రకటించారు. కరెంట్ పోతే.. పామాయిల్ తోటలో రైతుల వద్దకు వెళ్లి నీళ్లు అడుక్కునే పరిస్థితి. తక్షణమే కొత్త బోరు ఏర్పాటు చేయాలని ఖాళీ బిందెలతో వాటర్ ట్యాంక్ ఎక్కి తేదీ 13న వినూత్న ధర్నా చేశారు. దిగొచ్చిన ప్రభుత్వం ఒక రిగ్ బోరును తీసుకొచ్చి కాలనీలో బోరు ఏర్పాటు చేసింది. సీపీఎం నేత కే. గోవిందరావు, మూలపర్తి భవాని నాగరాజు ఈ పోరాటానికి నాయకత్వం వహించారు.



