'వాటర్ మేనేజ్‌మెంట్' పై గద్వాల కలెక్టర్ ప్రజెంటేషన్

ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్‌లో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న నీటి నిర్వహణ పద్ధతులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకుడు గుంతలు, పంట కుంటలు, చెక్‌డ్యామ్‌ల ద్వారా జల సంరక్షణ చేపట్టాలని ఆయన చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్‌తో తక్కువ నీటితోనే ఆరుతడి పంటలు పండించవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ కోరారు.





