← Back to news

మంగళగిరిలో పునుగుపిల్లి!

By Krishna· 4h ago
మంగళగిరిలో పునుగుపిల్లి!

గుంటూరు జిల్లా.. మంగళగిరి పానకాల స్వామి కొండపై పునుగుపిల్లి కనిపించినట్లు తెలిసింది. శేషాచలం, నల్లమల అడవుల్లో అరుదుగా ఇవి కనిపిస్తాయి. అలాంటి ఈ పునుగుపిల్లి.. కొండ ఎక్కుతున్న భక్తులకు కనిపించింది. దీని శరీరం నుంచి వచ్చే ఆయిల్.. సెంట్ వాసన వస్తుంది. తిరుమల శ్రీవారికి అభిషేకం తర్వాత.. మూల విరాట్టుకి ఈ ఆయిల్ పూస్తారని ప్రసిద్ధి. తద్వారా స్వామివారి విగ్రహానికి పగుళ్లు రాకుండా నిత్యం ప్రకాశిస్తూ ఉంటుందని నమ్ముతారు. ఇంతకీ భక్తులు చూసింది.. పునుగుపిల్లేనా అనేది అటవీ శాఖ కన్ఫామ్ చెయ్యాల్సి ఉంది.

More in AP