దెయ్యం రూమర్.. యూనివర్సిటీలో ప్రొటెస్ట్!
AI ఇంతగా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా దెయ్యాల అపోహలు పోవడం లేదు. పంజాబ్లోని చిత్కారా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో దెయ్యం ఉందంటూ ఓ రూమర్ వైరల్ అయ్యింది. హాస్టల్లో అరుపులు వినిపించాయని, ఇద్దరు అమ్మాయిలు కనిపించడం లేదని ప్రచారం జరిగింది. దీంతో స్టూడెంట్స్ రాత్రి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. కొందరు పోలీస్ వెహికల్ను కూడా డ్యామేజ్ చేశారు. యూనివర్సిటీలో ఎలాంటి మరణం జరగలేదని అధికారులు చెప్పారు. అవి రూమర్స్ అని క్లారిఫై చేశారు.
