ఆదివాసీ ప్రాంతంలో అన్రిజర్వుడ్.. రాజ్యాంగ విరుద్ధం!

ASR జిల్లా పెదబయలు మండలంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఎంపీటీసీ స్థానాలను అన్రిజర్వుడ్గా ప్రకటించడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ అన్నారు. నూటికి నూరు శాతం గిరిజనులున్న ప్రాంతంలో 17 ఎంపీటీసీ స్థానాలను అన్రిజర్వుడ్ చేసి గిరిజనేతరులకు అవకాశమివ్వడం అంటే కార్పొరేట్ శక్తులకు భూములను కట్టబెట్టడమేనని మండిపడ్డారు. హుకుంపేట, పెదబయలు, పాడేరులలో అన్రిజర్వుడ్ను రద్దు చేసి ఎస్టీలకే కేటాయించాలన్నారు.



