నాగార్జునను హగ్ చేసుకుని ఏడ్చేసిన అఖిల్!
అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించింది. ఎన్నాళ్లో ఎదురుచూస్తున్న ఈ భారీ విజయం దక్కడంతో అఖిల్ ఎమోషనల్ అయ్యారు. ఆనందభాష్పాలతో తన తండ్రి, కింగ్ నాగార్జునను గట్టిగా కౌగిలించుకున్నారు. కొడుకు సాధించిన ఈ సక్సెస్ చూసి నాగార్జున కూడా ఎంతో గర్వపడ్డారు. తండ్రీకొడుకుల మధ్య జరిగిన ఈ ఎమోషనల్ మూమెంట్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



