మీ ఓటు సేఫ్ ఏనా? అధికారుల తనిఖీ

భూపాలపల్లిలో ఓటర్ల నోటీసుల పంపిణీని ఆర్డీవో హరికృష్ణ, తహశీల్దార్ లక్ష్మీ రాజయ్య పరిశీలించారు. కృష్ణ కాలనీ, కార్ల్ మార్క్స్ కాలనీ, సీఆర్ నగర్, సుభాష్ కాలనీల్లో పర్యటించి BLOల పనితీరును చెక్ చేశారు. నోటీసులు వచ్చిన ఓటర్లు వెంటనే తమ ID ప్రూఫ్స్ బీఎల్‌ఓలకు ఇవ్వాలని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని, ఎవరూ ఓటు కోల్పోకూడదని స్పష్టం చేశారు. స్వయంగా వెళ్లి నోటీసులు ఇస్తూ, మ్యాపింగ్ లేని వివరాలను సేకరించి ప్రాసెస్ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
