14 వేల మందికి వేధింపులు: మమతా బెనర్జీ

CJP కార్యకర్తలు అశుతోష్, సౌరవ్ల అరెస్టును పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. యువతను, గొంతులను అణచివేసే ప్రయత్నంలో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయని ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, బెంగాల్లో తమ పార్టీకి చెందిన 14,000 మంది పోలీసులు, రాజకీయ నాయకుల వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించారు. రాజ్యాంగ హక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.


