బాలెంలలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట మండలం బాలెంల స్టేజ్ దగ్గర జరిగిన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. రోడ్డుపై వాకింగ్ చేస్తున్న ముగ్గురిని డీసీఎం వెహికల్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గుర్రం సైదులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా, ఆలకుంట్ల నాగరాజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. తీవ్ర గాయాలైన గొల్ల జానయ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.



