ఖైరతాబాద్ నిమజ్జనంలో విషాదం.. యువకుడు మృతి..
TG: తెలంగాణ.. ఖైరతాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా విషాదం జరిగింది. 20 ఏళ్ల కుర్రాడు పోలీసుల లాఠీచార్జ్‌కి భయపడి ట్యాంకర్‌పైకి ఎక్కిన టైంలో ప్రమాదవశాత్తూ కిందపడ్డాడని సమాచారం. అదే సమయంలో అటుగా వెళ్తున్న ట్రక్కు కింద పడటంతో యువకుడు మృతిచెందినట్లు తెలుస్తోంది. దీంతో అతని ఫ్రెండ్స్ ఖైరతాబాద్‌లో నిరసనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



