ఆ జడ్జి ముందు హాజరుకాను _కేజ్రివాల్

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ముందు హాజరుకావడానికి ఆయన నిరాకరించారు. ఆమె ఈ కేసుని విచారిస్తే తనకు న్యాయం జరగదని, అందుకే తాను కానీ, తన తరఫున లాయర్లు ఎవరూ కోర్టుకు హాజరు కాకూడదని డెసిషన్ తీసుకున్నామంటూ న్యాయమూర్తికే ఒక లెటర్ రాశారు. స్వర్ణకాంత శర్మ విషయంలో తాను సుప్రీం కోర్టులో పోరాడతానని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ తన నిరసన తెలియజేస్తున్నానని చెప్పారు.



