సీసీ రోడ్లకు ఇరువైపులా కాలువలు నిర్మించాలి

అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ అడపవలస గ్రామంలో సీసీ రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు నిర్మించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తామర్ల సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామస్తులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా, డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని తెలిపారు. దీంతో రోడ్లు దెబ్బతిని శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.



