గోడ వెనుక.. సీక్రెట్ ప్రైవేట్ లైబ్రరీ.!
సిరియా దేశంలో అబూ బిలాల్ అనే వ్యక్తి.. అసద్ పాలనకు భయపడి 15 ఏళ్ల కిందట తన ప్రైవేట్ లైబ్రరీని గోడ వెనుక దాచేశాడు. దేశం విడిచి పారిపోయిన అతను, ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చి సుత్తితో గోడను పగలగొట్టి చూశాడు. వందల పుస్తకాలు, సర్టిఫికెట్లు, వ్యక్తిగత వస్తువులు చెక్కుచెదరకుండా దొరికాయి. ఇది చాలా భావోద్వేగ ఘటన. అసద్ పాలన ఇప్పుడు లేదు. అందువల్ల సిరియాలో ఇదివరకు నిషేధించిన బుక్స్.. ఇప్పుడు పుస్తక ప్రదర్శనల్లో స్వేచ్ఛగా కనిపిస్తున్నాయి.
