తెలంగాణలో కొత్త ట్రాఫిక్ సేఫ్టీ బ్యూరో

TG: రాష్ట్రంలో ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ కోసం ప్రభుత్వం కొత్త బ్యూరో ఏర్పాటు చేసింది. ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’ (TG-TMARS)ను జీవో ద్వారా ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఈ-చలాన్లు, ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హైవే పెట్రోలింగ్ వంటి ఇన్వెస్టిగేషన్‌ను బ్యూరో పర్యవేక్షిస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో Road Crash Response Officerను నియమించి ప్రమాదాల టైమ్‌లో గోల్డెన్ అవర్‌లో బాధితులకు సహాయం చేయనున్నారు.



