22 మంది రైతులకు స్ప్రింక్లర్ యూనిట్ల పంపిణి

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలోని బ్రాహ్మణపల్లి, ఆసిరెడ్డిపల్లి, పల్లెతండా గ్రామాల్లో 22 మంది రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో స్ప్రింక్లర్ యూనిట్లు పంపిణీ చేశారు. బ్రాహ్మణపల్లిలో 10 మంది, ఆసిరెడ్డిపల్లిలో ఐదుగురు, పల్లెతండాలో ఏడుగురు రైతులకు వీటిని అందజేశారు. స్ప్రింక్లర్లతో నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు పంటలకు అవసరమైన నీటిని సమర్థవంతంగా అందించవచ్చని ఇబ్రహీంపట్నం డివిజన్ ఉద్యాన శాఖ అధికారి నవీన తెలిపారు.



