UPIకి కొత్త ఛార్జీలు.. ప్రకాశ్ రాజ్ కీలక ప్రశ్న!

UPI పేమెంట్లపై కొత్త ఛార్జీల విధానం చర్చకు దారితీస్తుండగా.. నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అక్టోబర్ 15 నుంచి 2 వేల రూపాయలకుపైగా వ్యాపార పేమెంట్లపై 0.4% MDRను వ్యాపారుల నుంచి వసూలు చేయనున్నారు. 75 వేలకుపైగా ట్రాన్సాక్షన్‌లకు గరిష్ఠంగా 300రూపాయలు ఉంటుంది. పర్సనల్ UPI ట్రాన్సాక్షన్స్, 2వేల వరకు వ్యాపార పేమెంట్లు ఫ్రీగానే ఉంటాయి. కస్టమర్ల నుంచి నేరుగా ఛార్జీ వసూలు చేయకపోయినా.. ఈ భారం చివరికి ఎవరి మీద పడుతుందనే ప్రశ్నను ప్రకాశ్ రాజ్ లేవనెత్తారు.
