← Back to news

కవిత భూపోరాటం.. రాష్ట్రవ్యాప్తంగా నాయకుల అరెస్ట్

By డీకే· 2 Jul 2026· హైదరాబాద్‌
కవిత భూపోరాటం.. రాష్ట్రవ్యాప్తంగా నాయకుల అరెస్ట్

TG: TRS చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఇవాళ భూపోరాటానికి పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. భూపోరాటానికి వెళ్తారనే సమాచారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో TRS నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కవిత భూపోరాటం చేయనున్నారు. మరికాసేపట్లో భూపోరాటం చేసే ప్రాంతానికి ఆమె చేరుకోనున్నారు.

More in Politics