← Back to news

ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

By Siva· 2h ago· Palapadu, Narasaraopet, Palnadu
ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీంతో కౌన్సిలర్, చైర్మన్ పదవులను ఆశిస్తున్న నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

More in Local