ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి

TG: జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు జరిగే గణేష్ నవరాత్రులను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

