పటాన్‌చెరులో మట్టి గణపతులు

వినాయక చవితికి పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత అని గ్రేస్ ప్రోటోకాల్ చైర్మన్ పట్లోళ్ల ఆదిత్యరెడ్డి అన్నారు. పటాన్‌చెరులో ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మట్టి విగ్రహాల వల్లే నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయని చెప్పారు. ఎన్విరాన్మెంట్‌కి హాని చేసే విగ్రహాలకు దూరంగా ఉంటూ, పర్యావరణహితమైన మట్టి వినాయకులనే వాడాలని ప్రజలను కోరారు. మీరు కూడా మీ ఊరి మట్టి లేదా సీడ్ గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.
