నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ నార్సింగి వద్ద కారు యాక్సిడెంట్ జరిగి కూకట్‌పల్లికి చెందిన ఇంటర్ స్టూడెంట్ మదన్‌మోహన్ రెడ్డి (17) స్పాట్‌లోనే చనిపోయాడు. ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం కారులో వెళ్లి, అర్ధరాత్రి కోకాపేట వ్యూపాయింట్ నుంచి తిరిగొస్తుండగా కారు బోల్తా పడింది. డోర్‌లోంచి బయటపడి కరెంట్ పోల్‌కి తగలడంతో తీవ్ర రక్తస్రావమై మదన్‌మోహన్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. విద్యార్థులు ఆల్కహాల్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
