కాశిబుగ్గలో మహా అన్నదానం.. కొండా సురేఖ ఎంట్రీ!

మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లాలోని కాశిబుగ్గలో మహా అన్నదానంలో పాల్గొన్నారు. శ్రీ దుర్గాభవాని యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.



