నవులూరులో ఘన వినాయక చవితి..!

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో సోమవారం వినాయక చవితి పూజలు ఘనంగా జరిగాయి. శివాలయం సెంటర్‌లో శ్రీ బాల గణపతి భక్త బృందం ఈ వేడుకలు నిర్వహించింది. తోట శ్రీనుబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. గత 26 ఏళ్లుగా ఈ బృందం చవితి వేడుకలు చేస్తోంది. మీ ఊరి వార్త మీరే పంపండి! మట్టిగణేషులకు సంబంధించిన వార్తలు, ఫొటోలు ఉంటే పంపండి.
