ఆర్బిట్రేటర్ నియామకాలపై NALSAR స్టడీ షాకింగ్ స్టడీ!

NALSAR యూనివర్సిటీ చేసిన స్టడీలో ఆర్బిట్రేటర్ల (కోర్టుకు వెళ్లకుండా గొడవలను పరిష్కరించే నిపుణులు) నియామకాల్లో పురుషులకే ఎక్కువ అవకాశాలు దక్కినట్లు తేలింది. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, బాంబే హైకోర్టుల్లో జరిగిన నియామకాల్లో 70 శాతం పురుషులకు, 30 శాతం మహిళలకు దక్కాయి. సుప్రీంకోర్టులో అయితే 79 శాతం నియామకాలు పురుషులకే వచ్చాయి.మొత్తం నియామకాల్లో 24 శాతం కేవలం 5 శాతం మందికే దక్కాయి. అంటే, కొద్దిమందికే మళ్లీ మళ్లీ అవకాశాలు వచ్చాయి.


