← Back to news

గిటార్‌కి ఫైన్‌. AI చేసిన పని!

By Anusha· 3h ago· Thehindu
గిటార్‌కి ఫైన్‌. AI చేసిన పని!

బెంగళూరులో AI ట్రాఫిక్ కెమెరా చేసిన మిస్టేక్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సౌవిక్ దత్తా స్కూటర్‌పై ఒంటరిగా వెళ్తూ వీపుపై గిటార్ కేస్ పెట్టుకున్నారు. కానీ AI కెమెరా దాన్ని వెనుక కూర్చున్న ప్యాసింజర్‌గా గుర్తించింది. హెల్మెట్ లేదంటూ 500 రూపాయల చలాన్ జారీ చేసింది. చలాన్ ఆయన భార్యకు వెళ్లడంతో సౌవిక్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. AIలో అప్పుడప్పుడూ ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని పోలీసులు తెలిపారు. చలాన్‌ను సరిచేస్తామని చెప్పారు.

More in National