విజయవాడ–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు

AP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ–తిరుపతి మధ్య ఈ నెల 13 నుంచి 16 వరకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. 07249 నంబర్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుంది. అలాగే.. 07250 నంబర్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి విజయవాడ వెళ్తుంది. ఈ ట్రైన్స్.. విజయవాడ నుంచి మార్నింగ్ 9 గంటల 30 నిమిషాలకూ, తిరుపతిలో రాత్రి 9 గంటల 10 నిమిషాలకు బయలుదేరతాయి. వీటిలో AC 2-Tier, AC 3-Tier, స్లీపర్, జనరల్ కోచ్లు ఉంటాయి.



