గుంతకల్లులో CMRF చెక్కులు.. 53 మందికి రూ.28.50 లక్షలు!
అనంతపురం జిల్లా గుంతకల్లులో శనివారం CMRF రిలీఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మండల ఇన్‌చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పాల్గొన్నారు. వారు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత రెండేళ్లలో గుంతకల్లు నియోజకవర్గంలో 1,068 మందికి రూ.6.65 కోట్లకు పైగా సహాయం అందిందన్నారు. ఈదఫా 53 మంది బెనిఫిషియరీలకు రూ.28.50 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
