అమలాపురంలో దసరా చేడీ తాలింఖానా

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా సందర్భంగా బ్రిటిష్ కాలం నాటి చేడీ తాలింఖానా విన్యాసాలు ఈ ఏడు కూడా అబ్బురపరుస్తున్నాయి. 1856 నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో ఏడు వీధుల వారు ఆయుధ పూజ చేసి కత్తిసాము, కర్రసాము, అగ్ని బరతా ప్రదర్శిస్తారు. ఏనుగు అంబారీ, పలు వాహనాల ఊరేగింపు సాగుతుంది. పేరూరు, బోడసకుర్రు, అంబాజీపేటల్లోనూ 140-150 ఏళ్ల ఉత్సవాలు జరుగుతాయి.



