చింతలమానేపల్లిలో గంజాయి సీజ్

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి గూడెం రూట్లో గురువారం పోలీసులు చేపట్టిన చెకింగ్స్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు పట్టుబడ్డారు. వారి దగ్గరి నుంచి 110 గ్రాముల గంజాయి, ఒక బైక్ను పోలీసులు సీజ్ చేశారు. అరెస్టయిన వారిని పొగిడి ప్రసాద్, గాజిరెడ్డి సంతోష్, గొల్ల సంతోష్లుగా గుర్తించారు. ఈ గంజాయి అమ్మిన మహారాష్ట్రకు చెందిన విక్రేతపై కూడా కేస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు SI కమలాకర్ తెలిపారు. యూత్ డ్రగ్స్కి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.



