← Back to news

గణేష్ మండపాలకు పోలీసుల కీలక నిబంధనలు

By DK· 1h ago
గణేష్ మండపాలకు పోలీసుల కీలక నిబంధనలు

TG: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి పోలీసుల అనుమతి పొందాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. మండపాల వద్ద CCTV కెమెరాలు, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, 24 గంటల వాలంటీర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. DJలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు వినియోగించరాదని స్పష్టం చేశారు.

More in Local