మంత్రి నిమ్మలకు ఫిర్యాదు.. DEEపై చర్యలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి జలవనరుల శాఖ DEE మల్లపు పుల్లయ్యపై ఉన్నతాధికారులు ఇవాళ శాఖాపరమైన చర్యలు చేపట్టారు. గండిపాలెం రిజర్వాయర్ కాలువల పూడికతీతకు ఓ అండ్ ఎం నిధుల కింద ₹5 లక్షలతో పనులు పూర్తి చేసినా, గుత్తేదారుడి బిల్లుల మంజూరుకు OTP ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. రామాపురంలో జరిగిన పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడుకు ఈ విషయంపై ఫిర్యాదు అందడంతో అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.



