← Back to news

పొందుగల చెక్‌పోస్ట్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

By Siva· 16h ago· Dachepalle, Dachepalli, Palnadu

పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆడహల్లి దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. అక్రమ నగదు, మద్యం, నిషేధిత వస్తువుల రవాణా ఆపాలని సిబ్బందికి సూచించారు. సరిహద్దు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

More in Local