దసరాకు తెలంగాణలో మద్యం జోరు.. ₹1000 కోట్లు!

TG: దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు ₹1,000 కోట్లు దాటవచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో లిక్కర్ షాపుల్లో సరిపడా నిల్వలు ఉంచాలని ఆదేశించారు. గత ఏడాది దసరాకు ముందు నాలుగు రోజుల్లోనే ₹1,000 కోట్లకు పైగా మద్యం నిల్వలను షాపులు తీసుకున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో 41 బార్ల కోసం 8,770 దరఖాస్తులు వచ్చాయి. వీటిని శుక్రవారం లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు.
