← Back to news

పులివెందుల లోక్ అదాలత్‌లో 122 కేసులకు పరిష్కారం

By Ram krishna· 2d ago· Bakarapuram, Pulivendula, Y.S.R. Kadapa
పులివెందుల లోక్ అదాలత్‌లో 122 కేసులకు పరిష్కారం

AP: కడప జిల్లా పులివెందుల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 122 కేసులు పరిష్కారమయ్యాయి. జూనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి రూ.1,48,89,680 చెల్లింపులతో కేసులు పరిష్కరించారు. స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అరుణ ఆధ్వర్యంలో రూ.2,09,400 చెల్లింపులతో 9,169 ఎస్‌టీసీ కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీయే రాజమార్గమని అన్నారు.

More in Local