పిచ్చికుక్క హడల్! ఇద్దరికి గాయాలు

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని అంగడి బజార్ ప్రాంతంలో మంగళవారం ఓ పిచ్చి కుక్క హడలెత్తించింది. ఆ కుక్క పలువురిపై దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని, చికిత్స కొనసాగుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్శ్రీ నివాస్ తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో పిచ్చికుక్కల సంచారాన్ని అధికారులు అదుపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.



