తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. 32 ఈ-బస్సులు షురూ!
తిరుమలలో భక్తుల రవాణా సౌకర్యం మరింత బెటరవుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల కొండపైకి 32 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. బుధవారం నారాయణగిరి సర్కిల్ దగ్గర వీటిని జెండా ఊపి ప్రారంభించారు. రిలయన్స్ ఫౌండేషన్ 25 బస్సులు, భారత్ బయోటెక్ 7 బస్సులను TTDకి విరాళంగా ఇచ్చాయి. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు భక్తులకు సేఫ్, ఎకో-ఫ్రెండ్లీ ట్రావెల్‌ని అందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.


