← Back to news

మృత్యువును జయించిన పైలట్లు

By sahani· 1d ago

బ్రిటన్‌లోని వేల్స్‌లో రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF) ట్రైనింగ్ జెట్ ఘోర ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హాక్ టీ2 ఫైటర్ జెట్‌లో మంటలు రావడంతో అది నిట్టనిలువునా కుప్పకూలింది. జెట్ క్రాష్ అయ్యే కొన్ని క్షణాల ముందే ఇద్దరు పైలట్లు చాకచక్యంగా ఎజెక్ట్ అయి ప్రాణాలు దక్కించుకున్నారు. విమానం రెసిడెన్షియల్ ఏరియాకు సమీపంలోనే పడి భారీ ఫైర్ బాల్‌లా పేలిపోయింది. జెట్ నివాస ప్రాంతాలకు దూరంగా కూలిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

More in Current Affairs