← Back to news

6 సీట్లకు ఓటింగ్.. 9న Results

By Mahesh· 1h ago· Velugu
6 సీట్లకు ఓటింగ్.. 9న Results

తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో 5 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ సీటుకు ఈరోజు ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. తమిళనాడులో మదురాంతకం, ధారపురం, పుదుచ్చేరిలో తట్టంచావడి, వెస్ట్ బెంగాల్‌లో నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరిగింది. అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికీ ఓటింగ్ జరిగింది. నందిగ్రామ్‌లో 79.39%, రేజినగర్‌లో 78.42%, మదురాంతకంలో 78.86%, తట్టంచావడిలో 78.83%, ధారపురంలో 78.53%, నాగావ్‌లో 76% పోలింగ్ నమోదైంది. ఈనెల 9న ఓట్ల కౌంటింగ్ జరగనుంది.

More in National