← Back to news

మద్యం మత్తులో బడికి.. ఆపై స్టూడెంట్ మీద దారుణం

By Vishi· 2h ago· X

పాఠాలు చెప్పాల్సిన టీచర్ మద్యం తాగి బడికి వచ్చాడు. UP రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లా సియానా తహసీల్ పరిధిలోని మహువాఖేడాలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఆ టీచర్ 6వ తరగతి చిన్నారిని బూతులు తిడుతూ, కొట్టడమే కాకుండా, గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశాడు. ఈ ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. బాధితుడి తల్లిదండ్రులు, గ్రామస్తులు బడి వద్ద నిరసన తెలిపారు. దీంతో టీచర్ అక్కడి నుంచి పారిపోయాడు. అధికారులు అతణ్ని సస్పెండ్ చేశారు.

More in National