‘బావడీ’ నుంచి నీరు.. భలే..భలే!
కొత్తగా భలే ఉంది కదా ఇది! హిమాచల్ ప్రదేశ్‌లోని కొండప్రాంతాల్లో ఉండే ప్రజలు ‘బావడీ’ నుంచి నీటిని తోడేందుకు ఈ వినూత్నమైన ఆలోచన చేశారు. హిమాలయ ప్రాంతాలలో కొండ ఊట నీటిని నిల్వ చేయడానికి వందల ఏళ్ల నుంచి 'బావడీ' (మెట్ల బావులు) వాడుతున్నారు. బావి బయట ఒక పొడవైన మెటల్ పైపును పెట్టి, బయట నిలబడిన వ్యక్తి హ్యాండిల్‌ను కిందికి అని, పైకి లేపడం ద్వారా లోపలి బకెట్ నీటిని నింపుకుంటుంది. ఆ తర్వాత పైపును వంచగానే, స్వచ్ఛమైన నీరు పైపు గుండా ప్రవహిస్తూ బయటకు వస్తుంది.
