← Back to news

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: SP

By mpkr· 4h ago· Ananthapuramu
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: SP

అనంతపురం జిల్లాలోని అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం పట్టణాల్లో పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్లు జిల్లా ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సభలు, ఆందోళనలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఐదుగురికి మించి గుమిగూడటం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More in Local