← Back to news

బస్టాండులో బ్యాగులో బాంబులు..

By Jagadish· 1h ago
బస్టాండులో బ్యాగులో బాంబులు..

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో సోమవారం రాత్రి టెన్షన్. పోలీసులు రూటిన్ చెకింగ్ చేస్తుండగా ఓ ప్రయాణికుడి లగేజీ అనుమానాస్పదంగా కనిపించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆసిఫ్ అలీ నర్సరావుపేట నుంచి విజయవాడకు వస్తున్నాడు. అతని బ్యాగును పరిశీలించగా 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు దొరికాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు ఎవరివి? ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

More in Local