లోక్ అదాలత్‌లో 5,254 కేసులు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్‌లో మెదక్ జిల్లాలో పోలీసు, న్యాయశాఖల సమన్వయంతో 5,254 కేసులకు పరిష్కారం లభించిందని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. శనివారం రాత్రి వరకు జరిగిన అదాలత్‌లో 3,984 డీడీ కేసులు, 538 ఐపీసీ కేసులు, 732 ఈ-పెట్టీ కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. సైబర్ నేరాలపై 14 కేసుల్లో కోర్టు ఆదేశాలతో రూ.20.27 లక్షలను బాధితులకు రీఫండ్ చేసినట్లు చెప్పారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
