← Back to news

SFI నాయకుడు మోహిత్‌కు నారాయణపేట జిల్లా SFI ఆర్థికసాయం

By NRPT· 1d ago· నారాయణపేట్ జిల్లా
SFI నాయకుడు మోహిత్‌కు నారాయణపేట జిల్లా SFI ఆర్థికసాయం

HCU SFI నాయకుడు మోహిత్‌కు అండగా నిలిచేందుకు SFI నారాయణపేట జిల్లా కమిటీ ఆర్థిక సహాయం అందించింది. బెయిల్ ప్రక్రియలో ష్యూరిటీల కోసం అవసరమైన ఖర్చులకు రూ.2,000ను SFI రాష్ట్ర నాయకుడు రమేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో SFI నారాయణపేట జిల్లా కార్యదర్శి పవన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థి ఉద్యమ నాయకులు, కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు వారు తెలిపారు.

More in Local