కాటారం CIగా భీమేష్ బాధ్యతలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సర్కిల్ CIగా ఎంబడి భీమేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం CI మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అక్రమాల కట్టడి, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులతో నేరుగా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.



